'రక్షణ గోడ లేక వాహనదారుల ఇబ్బందులు'
KRNL: ఆదోని రామజల చెరువుగట్టు ప్రహరీ గోడ కూలిపోవడంతో ప్రయాణికులు వణికిపోతున్నారు. దొడ్డనకేరి, సుల్తానాపురం, రణమండల కొండకు వెళ్లే ఈ రద్దీ మార్గంలో రక్షణ గోడ లేక వాహనాలు చెరువులో పడే ప్రమాదం ఉంది. ఆరు నెలలుగా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరిగే చోటు కావున, తక్షణమే మరమత్తులు చేయాలని కోరారు.