అగ్నిప్రమాదం.. 5 క్వింటాళ్ల పత్తి దగ్ధం
MNCL: భీమిని మండలం రాజారాంలో రైతు దుర్గం బక్క ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి శుక్రవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. కుటుంబ సభ్యులు పనులకు వెళ్లిన సమయంలో మంటలు చెలరేగాయి. గమనించిన గ్రామస్థులు వెంటనే స్పందించి ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు 5 క్వింటాళ్ల పత్తి కాలిపోవడంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.