గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

MBNR: బాలానగర్‌ మండలం మోతీఘణపూర్‌ శివారులో గంజాయి విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన రాజేందర్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 420 గ్రాముల ఎండు గంజాయి, 10 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌లో తక్కువ ధరకే కొని ఇక్కడ గ్రాముల లెక్కన అధిక ధరకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. అతనిపై కేసు నమోదు చేసినట్లు SI నాగరాజు తెలిపారు.