ఘోరం.. అగ్నికి ఆహుతి అయిన 300 క్వింటాళ్ల పత్తి
SDPT: ఆరు బయట ఆరబోసిన పత్తిని ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని సుమారు 300 క్వింటాళ్ల పత్తి దగ్ధం అయింది. ఈ ఘటన బెజ్జంకిలో చోటు చేసుకుంది. బండి ఐలయ్య అనే రైతు పండించిన పత్తి అంతా మంటాల్లొ కాలి బూడిద కావడంతో కన్నీరుమున్నీరయ్యాడు. తన సొంత పోలంలో పది ఎకరాలతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసకుకొని పత్తి సాగు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.