విద్యుత్ అధికారుల అత్యుత్సాహం..బైక్ డ్యామేజ్
MNCL: మంచిర్యాల పట్టణంలో విద్యుత్ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా చెట్లు తొలగించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చెట్ల తొలగింపు సందర్భంగా దుకాణం ఎదుట నిలిపిన బైక్ పై చెట్టు కొమ్మలు పడి బైకు పాడయింది. దీంతో బాధితుడు నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. చెట్ల తొలగింపు సమాచారం అందిస్తే బైక్ తీసి పక్కన పెట్టుకునే వాడినని అధికారులు ఇలా చేయడం సరికాదన్నారు.