టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం
MNCL: హాజీపూర్ మండలం ముల్కల్ల ప్రభుత్వ హై స్కూల్‌లో USFI ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గురువారం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్‌లో మండల వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు DEO యాదయ్య ప్రశంసాపత్రాలు, మెమెంటోలు బహుమతులు అందజేశారు.