భార్య, ప్రియుడు అరెస్ట్

భార్య, ప్రియుడు అరెస్ట్

CTR: భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడుని అరెస్టు చేసినట్టు CI శంకరయ్య సోమవారం తెలిపారు. మోట్లచేను గ్రామానికి చెందిన బాలరాజు భార్య సూర్య తిరుపతి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది తెలుసుకొని బాలరాజు భార్యను మందలించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ప్రియుడుతో కలిసి కత్తితో నరికి హత్య చేశారు. నిందితులు ఈరోజు బస్ స్టాప్ వద్ద ఉండగా అరెస్టు చేశారు.