ఈనెల 5 నుంచి రెవెన్యూ సదస్సులు: జిల్లా కలెక్టర్

ఈనెల 5 నుంచి రెవెన్యూ సదస్సులు: జిల్లా కలెక్టర్

PDPL: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పైలెట్ ప్రాజెక్టు కింద ఎలిగేడు మండలంలో ఈనెల 5 - 19 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.