మహానందిలో జస్టిస్ హరి హరినాథ శర్మ పూజలు

మహానందిలో జస్టిస్ హరి హరినాథ శర్మ పూజలు

NDL: మహానందిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి హరి హరినాథ శర్మ పూజలు చేశారు. ఆదివారం రాత్రి క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాదలతో ఈవో శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ రమాదేవి స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరి సమేత మహానంది ఈశ్వర స్వామి వార్లకు అభిషేకార్చన పూజలు చేపట్టారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.