ఘనంగా బక్రీద్ పండగ వేడుకలు

BDK: ఇల్లందు పట్టణంలో బక్రీద్ పండగ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున పండగ నిర్వహించారు. ఈద్గాల వద్ద నమాజు చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మసీదుల వద్ద, ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలకు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.