'పుణ్యక్షేత్రాల కోసం అద్దెకు బస్సులు'
KMR: పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తామని నేడు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ సంస్థ ద్వారా డీలక్స్, లగ్జరీ, సెమి డీలక్స్ బస్సులను అద్దెకు తీసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.