వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి జాతర

వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి జాతర

కోనసీమ: పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా జరిగాయి. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గరగ నృత్యాలు, భాజా భజంత్రీలు, బాణాసంచా కాల్పులతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.