బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NZB: మాక్లూర్ మండల భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో సోమవారం ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై చర్చించారు. అదే విధంగా పార్టీని పటిష్టం చేయడంలో భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.