గేట్‌లో మెరిసిన పొందూరు వాసి

గేట్‌లో మెరిసిన పొందూరు వాసి

SKLM: పొందూరు మండలం ధర్మపురంకి చెందిన ఎం రాజ్‌ కుమార్ జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష గేట్ (GATE)లో ఆల్ ఇండియా ర్యాంక్ 248 సాధించి ప్రతిభ చాటారు. ఫిబ్రవరి 8న ఆల్ ఇండియా గేట్ పరీక్షల్లో పాల్గొని రాశారు. ఈ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రాజ్‌ కుమార్ ప్రస్తుతం ఐఐటి ధన్‌బాద్‌లో AI ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌‌లో పరిశోధనలు చేస్తున్నారు.