కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలింది: పవన్
AP: రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనం కూడా కావచ్చు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ కొబ్బరి చెట్లు, పచ్చదనంతో చాలా ఆనందంగా ఉంటుందని తెలంగాణ నాయకులు అనే వారని గుర్తు చేసుకున్నారు. కానీ ఈరోజు కొబ్బరి చెట్ల మొండాలు కూడా లేవని చెప్పారు. కోనసీమకు అంత దిష్టి తగిలిందన్నారు. దీనిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.