అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
MNCL: అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఎస్ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రియాంకకు మందమర్రి మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో 2014లో వివాహం జరిగింది. అయితే కొంతకాలంగా ప్రియాంకను భర్త, అత్తమామలు, మరిది వేధించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది.