భారత్‌లో గూగుల్ ఏఐ ప్లస్ సేవలు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ‘ఏఐ ప్లస్’ సేవలు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. దీని నెలవారీ చందాను రూ.399గా ప్రకటించింది. కొత్తగా వచ్చిన చందాదారులు తొలి ఆరు నెలల పాటు ఈ సేవలను రూ.199కే ఆనందించొచ్చని తెలిపింది. ఈ ప్లాన్ ద్వారా గూగుల్ లేటెస్ట్ ఏఐ మోడళ్లను, ఫీచర్లను తక్కువ ధరకే పొందొచ్చని గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది.