దంపతుల మర్డర్‌ కేసు ఛేదన

దంపతుల మర్డర్‌ కేసు ఛేదన

VSP: విశాఖలో కలకలం రేపిన దువ్వాడ డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడైన ప్రసన్నకుమార్ మిశ్రాను శనివారం ఒడిశాలోని పూరీలో అరెస్ట్ చేసినట్టు నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి శనివారం చెప్పారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే యోగేంద్రబాబు దంపతులను మిశ్రా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.