సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

KMM: సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. మొబైల్ ఫోన్ ద్వారానే అధిక శాతం నేరాలు జరుగుతున్న దృశ్య సైబర్ నేరాలపై ఆదివారం మండల కేంద్రంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.