జీజీహెచ్‌లో పైసా చెల్లించొద్దు: సూపరింటెండెంట్

జీజీహెచ్‌లో పైసా చెల్లించొద్దు: సూపరింటెండెంట్

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్యం, మందులు, పరీక్షలు అన్నీ పూర్తిగా ఉచితమని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి స్పష్టం చేశారు. ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని రోగులకు సూచించారు. పేద ప్రజలు మధ్యవర్తుల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.