జైతవరంలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

జైతవరంలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

AKP: చీడికాడ మండలం జైతవరం గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్‌కు గురై లాలం లక్ష్మణమ్మ (35) అనే మహిళ మృతి చెందింది. బి.సింగవరం సమీపంలోని తమ పొలంలో పశువులకు గడ్డి కోస్తుండగా, వ్యవసాయ మోటార్‌కు విద్యుత్ సరఫరా చేసే వైర్ తెగి ఆమెపై పడింది. దీంతో షాక్కు గురై ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై చీడికాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.