VIDEO: ప్రభుత్వ మహిళా కళాశాల రోడ్డులో ట్రాఫిక్ జామ్

VIDEO: ప్రభుత్వ మహిళా కళాశాల రోడ్డులో ట్రాఫిక్ జామ్

శ్రీకాకుళం నగరం పరిధిలోని ప్రభుత్వ మహిళా కళాశాల రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు సమీపంలోని పరీక్ష కేంద్రాల నుంచి ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆటోలు, కార్లు, ద్వి చక్ర వాహనాలు ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయాయి. దాదాపు గంటపాటు ఈ పరిస్థితి కొనసాగింది.