ఓ వైపు ఉష్ణోగ్రత.. మరో వైపు దోమలు
HYD: నగరంలోని ప్రజలు గరిష్ఠ ఉష్ణోగ్రతతో అల్లాడిపోతుంటే మరో వైపు రాత్రి వేళలో దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో దోమలు అంతకంతకు పెరుగుతున్నాయి. చెరువులు, మూసీ నది, నిర్మాణంలోని భవనాలు దోమల సంతానోత్పత్తి కేంద్రాలుగా మారాయి. రాత్రంతా ప్రజలకు దోమలు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా బల్దియా అధికారులు మాత్రం పట్టిపట్టనట్లు ఉన్నారని విమర్శలు వస్తున్నాయి.