మదనపల్లె వన్‌టౌన్ ఎస్సైగా చంద్రశేఖర్ బాధ్యతలు
అన్నమయ్య: మదనపల్లె వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా నియమితులైన చంద్రశేఖర్ బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. తన బాధ్యతల పరిధిలో చట్టం, శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎస్సై తెలిపారు.