VIDEO: 'ప్రాణ రక్షణకు హెల్మెట్ ధారణ తప్పనిసరి'

VIDEO: 'ప్రాణ రక్షణకు హెల్మెట్ ధారణ తప్పనిసరి'

ASR: కాళ్ల భద్రతకు చెప్పులు ధరించినట్లే, ప్రాణాలను రక్షించుకునేందుకు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కొయ్యూరు సీఐ బీ. శ్రీనివాసరావు ద్విచక్ర వాహనదారులకు సూచించారు. ఆదివారం ఎస్సై కిషోర్ వర్మతో కలిసి రాజేంద్రపాలెం వారపు సంతను సందర్శించారు. సంతకు వచ్చిన వాహనదారులతో సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు.