కరీంనగర్ ఎస్సై భార్య ఆత్మహత్య

కరీంనగర్ ఎస్సై భార్య ఆత్మహత్య

KNR: కరీంనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య మంగళవారం గన్నేరు పప్పు దంచుకుని తిని బలవన్మరణానికి పాల్పడింది.  కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.