'విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి'
BHPL: జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం మార్చి 10 వరకు పొడిగించినట్లు జిల్లా అధికారులు ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ధికారులు మాట్లాడుతూ.. అర్హత గల విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.