'పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

'పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో ఆకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, MLA వివేక్ వెంకటస్వామి శనివారం ప్రకటనలో తెలిపారు. వర్షానికి వరి, మిర్చి, మామిడి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దెబ్బతిన్న పంటల వివరాలను సర్వే చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి సాయం అందిస్తామన్నారు.