మనుబోలులో టిప్పర్ స్వాధీనం

మనుబోలులో టిప్పర్ స్వాధీనం

NLR: మనుబోలు మండలం బద్దెవోలు చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఎస్సై రాకేశ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ఇసుక టిప్పర్‌ను  పట్టుకున్నారు. ఆ టిప్పర్ సురాయపాలెంలో ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వెళ్లాల్సి ఉంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా గూడూరు వైపు వెళుతుండడంతో ఎస్సై పట్టుకున్నారు.