రంజాన్‌కు పటిష్ట భద్రత: సీపీ సునీల్‌ దత్

రంజాన్‌కు పటిష్ట భద్రత: సీపీ సునీల్‌ దత్

KMM: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గోళ్లగూడెం ఈద్గాను సందర్శించారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ వసతులు బందోబస్తుపై అధికారులకు పలు సూచనలు చేశారు.