రైతుబజార్లలో తనిఖీలు నిర్వహించిన కలెక్టర్
NTR: పటమట హైస్కూల్ రోడ్డులో గల రైతు బజార్‌ను కలెక్టర్ లక్ష్మీశా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుబజారుల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా వినియోగదారులకు సేవలందించాలని కలెక్టర్ కోరారు. స్టాళ్లను, ధరల పట్టికలను, అమ్మకాలు నిర్వహిస్తున్న రైతుల గుర్తింపు కార్డులను నిశితంగా పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలను నిర్దేశ రేట్ల ప్రకారం అందించాలన్నారు.