ఏపీఆర్వోలకు సత్కారం
VSP: ఏపీఆర్వోలు శ్రీనివాసరావు, ఏవీఎస్ వెంకటరావు సేవలు ప్రశంసనీయమని సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు కె.సదారావు తెలిపారు. విశాఖ డివిజనల్ పీఆర్వోలుగా పదోన్నతి పొందిన సందర్భంగా మంగళవారం శాఖ కార్యాలయంలో వారిద్దరిని సత్కరించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం, మీడియాతో సమన్వయం వంటి అంశాల్లో వారు సమర్థంగా పనిచేశారని కొనియాడారు.