బీసీ స్టడీ సర్కిల్‌లో ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమం

KNR: జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి, హైదరాబాద్ సంస్థానం మాత్రం చీకటిలోనే ఉండిపోయిందని, 1948 సెప్టెంబర్ 17న వల్లభాయ్ పటేల్ కృషితో హైదరాబాద్‌కు స్వేచ్ఛ వచ్చిందన్నారు.