ఆసక్తిగా 'పంచాయత్' సీజన్ 4 టీజర్

ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్‌సిరీస్ 'పంచాయత్'. ఈ సిరీస్ నాలుగో సీజన్‌ జూలై 2 నుంచి ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్'లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సదరు సంస్థ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. దీపిక్ కుమార్, అక్షత్ సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ తెలుగులో 'సివరపల్లి' పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే.