నేడు జిల్లాకు వర్ష సూచన

ATP: అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే వేళ చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించింది.