VIDEO: జనసేనలోకి పలువురి చేరిక

KDP: ఎన్నికల్లో విజయం తర్వాత రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరికలు విరిగా కొనసాగుతున్నాయి. సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామానికి చెందిన పలువురు యువకులు గురువారం జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రామయ్య సూచించారు.