'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి'
ADB: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. బేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కలెక్టర్ రాజర్షి షాను నిన్న కలిసి బడిబాట కార్యక్రమం గోడ ప్రతులను ఆదిలాబాద్‌లో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు.