కుల బహిష్కరణ చేసిన నిందితులపై కేసు నమోదు

BDK: టేకులపల్లి మండలం రోళ్లపాడులో ఓ కుటుంబాన్ని గ్రామ పెద్దల మాట వినలేదని కులబహిష్కరణకు గురిచేశారు. భూ వివాదంపై పంచాయతీలో వ్యతిరేకంగా స్పందించిన అంగన్వాడీ టీచర్ వెంకటరమణ కుటుంబాన్ని గ్రామపెద్దలు బహిష్కరించారు. సోమవారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించి నిందితులపై కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.