'పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి'
MNCL: బెల్లంపల్లి పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం 2వ వార్డులో కౌన్సిలర్ వంశీకృష్ణతో కలిసి ఆయన పర్యటించారు. వర్షాకాలంలో పెద్దకాలువ నీరు ఇళ్లలోకి వస్తుందని కౌన్సిలర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కమిషనర్, సమస్య పరిష్కారానికి కాలువ మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు.