సీసీ రోడ్డును ప్రారంభించిన యల్లటూరు
KDP: రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు తెలిపారు. శనివారం సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి రామకృష్ణాపురంలో సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రోడ్లను పునర్నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.