VIDEO: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

VIDEO: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

HYD: గంగాబౌలిలోని నటరాజ్ నగర్‌లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, టప్పాచబుత్ర పోలీసులు ఈరోజు దాడి చేశారు. ఈ దాడుల్లో 16 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.93,390 స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఇర్ఫాన్ ఈ పేకాట స్థావరాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.