మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు
KMM: ఖమ్మం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 17లోగా ఖమ్మంలోని బీఆర్ అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తు అందజేయాలని సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేయాలని వివరించారు.