రసాలొలికే మామిడి తింటే ఆ కిక్కే వేరు..!
KMR: వేసవి కాలంలో భానుడు భగ్గుమనడం సహజమే. కానీ ఈ సీజన్‌లో పండే మామిడి మాత్రం అమోఘం. మామిడి అంటే ఇష్టపడని వారు ఉండరని చెప్పడం అతిశయోక్తి కాదు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అందరూ కలిసి కూర్చొని రసాలొలికే మామిడి తింటే ఆ కిక్కే వేరు. ఎండల వేడి మధ్య మామిడి తియ్యదనం అందరికీ మనో ఆనందాన్ని పంచుతుంది. మరి మీరు ఈ సీజనల్ ఫ్రూట్ తిన్నారా..? కామెంట్ చేయండి.