VIDEO: వర్ధన్నపేటలో గెలిచిన కౌన్సిలర్ కు ఘన సన్మానం
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు కౌన్సిలర్లను సోమవారం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం కౌన్సిలర్లు కట్టుబడి పనిచేయాలని సూచిస్తూ, ప్రజల ఆశలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.