VIDEO: ఘనంగా మహాబూబ్ సుభానీ ఉరుసు గంధోత్సవం

VIDEO: ఘనంగా మహాబూబ్ సుభానీ ఉరుసు గంధోత్సవం

TPT: పాకాల ఫకీర్‌పేటలో మహాబూబ్ సుభానీ ఉరుసు సందర్భంగా శనివారం రాత్రి గంధోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని గంధం, చద్దర్ సమర్పించారు. ఫకీర్లు, ముజావర్లు మేళా తాళాలతో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో నూతన సిమెంట్ రోడ్డును ప్రారంభించి, టీడీపీ జెండాను ఆవిష్కరించారు.