VIDEO: పారిశుధ్యం, చెరువు కట్ట సుందరీకరణలో శ్రీకారం
WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రధానంగా పారిశుధ్యం, చెరువు కట్ట సుందరీకరణ, ఆలయాల పరిశుభ్రత, పాఠశాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపట్టినందుకు గ్రామస్థులు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం తన లక్ష్యం అన్నారు. ఇందుకు గ్రామ యువత సహకరించాలని కోరారు.