దుప్పలపూడిలో ముగ్గురు జూదరులు అరెస్ట్

E.G: అనపర్తి మండలం దుప్పలపూడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అనపర్తి ఎస్సై రామారావు తెలిపారు. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా, దుప్పలపూడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 2100 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.