‘ఉపాధి పనులు గ్రామాభివృద్ధికి పునాదులు’

‘ఉపాధి పనులు గ్రామాభివృద్ధికి పునాదులు’

NLG: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ ఇవాళ ప్రారంభించారు. గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టామని, ఇవి గ్రామాభివృద్ధికి పునాదులు కావాలని ఆకాంక్షించారు. పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప సర్పంచ్ జింజి రాజు, కార్యదర్శి శారద, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ పాల్గొన్నారు.