VIDEO: రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో విశేష పూజలు
NLG: కనగల్ మండలం దర్వేశిపురంలో శ్రీ రేణుక యల్లమ్మ తల్లికి ఇవాళ విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రాతఃకాల నిజఅభిషేకం, అలంకరణ, శ్రీ దేవి ఖడ్గమాల నామవాళి కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలు సమర్పించి, మేకలు, కోళ్లు బలి ఇచ్చారు.