మళ్లీ వర్షం.. మ్యాచ్ మరింత ఆలస్యం
నవీ ముంబై వేదికగా జరగాల్సిన భారత్-సౌతాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ రోజు మ్యాచ్‌ను కనీసం 20 ఓవర్ల చొప్పున ఆడించడానికి రాత్రి 9:08 గంటల వరకు కటాఫ్ టైమ్‌గా నిర్ణయించారు. ఒకవేళ అప్పటివరకు కూడా వర్షం తగ్గకుంటే, ఈ ఫైనల్ మ్యాచ్‌ను రిజర్వ్ డే (రేపటికి) వాయిదా వేస్తారు.